: బోర్డు తిప్పేసిన మరో చిట్ ఫండ్ సంస్థ
విజయవాడలో 'యాపిల్ ట్రీ' అనే చిట్ ఫండ్ సంస్థ ఖాతాదారులను నిలువునా ముంచేసి బోర్డు తిప్పేసింది. కేరళకు చెందిన ఈ చిట్ ఫండ్ సంస్థ విజయవాడ, హైదరాబాదులలో ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడి మోసగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.