: లోక్ సభకు సెప్టెంబర్లో ఎన్నికలు: ములాయం
లోక్ సభకు త్వరలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జోస్యం చెప్పారు. పార్లమెంటు బడ్జెట్టు సమావేశాల తర్వాత, యూపీఎ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి తనకు విశ్వసనీయ సమాచారం ఉందనీ, బడ్జెట్టు సమావేశాలు పూర్తవగానే ఎన్నికల ప్రకటన రావచ్చని ఆయన చెప్పారు. సెప్టెంబర్లో ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉందని చెబుతూ, పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని ములాయం కోరారు.