: హైదరాబాద్ లో ఉన్న కాలానికి కిరాయి కట్టాల్సిందే: ఆమోస్
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదని, తాత్కాలిక రాజధాని మాత్రమేనని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ స్పష్టం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగగానే సీమాంధ్ర ప్రజలు వారి ప్రాంతానికి రాజధానిని మార్చుకోవాలని సూచించారు. సీమాంధ్రకు హైదరాబాద్ రాజధానిగా ఉన్నన్నాళ్లు వారు ఇక్కడ కిరాయి దారులేనని అన్నారు. అలా కలిసి ఉన్నంత కాలం తెలంగాణ ప్రభుత్వానికి కిరాయి కట్టాల్సిందేనని ఆమోస్ అభిప్రాయపడ్డారు.