: తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలనే జగన్ పర్యటనలు: కోడెల శివప్రసాద్
కొన్ని రోజుల నుంచి వరుస పర్యటనలు చేస్తూ పలు రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలనే జగన్ పర్యటనలు చేస్తున్నారని కోడెల విమర్శించారు. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగన్ వీరందరినీ కలిస్తే సాక్షులు ప్రభావితం అయ్యే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కు బెయిల్ మాత్రమే వచ్చిందని, నిర్దోషిత్వం ఇంకా రుజువు కాలేదని గుర్తు చేశారు.