: కృష్ణా జిల్లాలో లక్షా 25వేల హెక్టార్లలో వరిపంట నష్టం: మంత్రి పార్ధసారథి
హెలెన్ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో లక్షా 25వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం జరిగినట్లు మంత్రి పార్ధసారథి తెలిపారు. అంతేగాక 4వేల హెక్టార్లలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. అయితే, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.