: హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చింది సీమాంధ్ర సీఎంలే: ఆనం వివేకా
తెలంగాణ ప్రాంత సీఎంల కంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులే హైదరాబాద్ కు ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నేతలు సమైక్యంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రయత్నిస్తే... సీమాంధ్రలో పార్టీలన్నీ ఎవరికి వారుగా విడిపోయి, విభజనకు అనుకూల నిర్ణయం వచ్చేలా సహకరిస్తున్నారని మండి పడ్డారు.