: విభజన వల్ల ప్రజలే తీవ్రంగా నష్టపోతారు: లగడపాటి
రాష్ట్ర విభజన వల్ల ప్రజలే తీవ్రంగా నష్టపోతారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కృష్ణా జిల్లా చందర్లపాడులో నిర్వహించిన రచ్చబండ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంత మంది విభజన వాదులు సోనియా గాంధీకి దేవాలయాలు నిర్మిస్తామంటున్నారని, భవిష్యత్తులో పదవులు రాకపోతే ఆ గుడిని వారే కూల్చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యత కోసం కృషి చేస్తున్నారని, ఏపీఎన్జీవోల పోరాటం వృథా కాదని లగడపాటి అన్నారు.