: యూటీ అంటే ఊటీలో షూటింగ్ చేసినట్లు కాదు చిరంజీవీ.. : నాగం
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యలను బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి తప్పుబట్టారు. కేంద్ర పాలిత ప్రాంతం చేయడమంటే ఊటీలో షూటింగ్ చేసినట్లు కాదని ఎద్దేవా చేశారు. షరతులు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇరు ప్రాంతాల మధ్య అపోహలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.