: ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జగన్ భేటీ కానున్నారు. ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను విభజించాలన్న నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా జగన్ రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్ర విభజన జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అనంతరం, సాయంత్రం 5.30 గంటలకు జనతాదళ్ (యూ) అధినేత శరద్ యాదవ్ తో జగన్ సమావేశంకానున్నారు.