: తరుణ్ తేజ్ పాల్ ను నేడు విచారించనున్న గోవా పోలీసులు
'తెహల్కా' వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ కేసు విచారణను గోవా పోలీసులు మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు నేడు తేజ్ పాల్ ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సహచర ఉద్యోగినిపై లైంగిక దాడికి యత్నించిన తేజ్ పాల్ పై అత్యాచారయత్నం కింద నిన్న(శుక్రవారం) ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.