: తాజ్ మహల్ గొప్పతనాన్ని కూడా మోడీ క్లెయిమ్ చేసుకుంటారు: అఖిలేశ్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురించి పరోక్షంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. మార్కెటింగ్ ప్రచారంతో గుర్తింపును తెచ్చుకుంటున్నారని, అమెరికా వీసా దొరికితే.. ఘనమైన తాజ్ మహల్ నిర్మించిన చరిత్ర తమదేనని కూడా చెప్పుకుంటారంటూ దెప్పిపొడిచారు.