: జీడిమెట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్ధుల మృతి
హైదరాబాద్, జీడిమెట్ల సమీపంలో హెచ్ఎంటి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. దుండిగల్ లోని ఎమ్.ఎల్.ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతున్న వినోద్, సురేందర్ లు డిగ్రీ చదువుతున్న తమ స్నేహితుడు వినయకుమార్ తో కలిసి ఈ రోజు తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై చింతల్ నుంచి జీడిమెట్ల వైపు వెళుతున్నారు. హెచ్ఎంటి కంపెనీ వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.