: పీఎస్ లో లొంగిపోయిన హత్యకేసు నిందితులు
సంచలనం సృష్టించిన ముగ్గురి హత్యకేసులో నిందితులైన 11 మంది అనూహ్యంగా బీమడోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ కేసులో నిందితులైన మరో పది మంది ఇంకా పరారీలోనే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బీమడోలు మండలం చెట్టెన్నపాడు గ్రామంలో జరిగిన ఈ హత్యలు గతంలో సంచలనం రేపాయి. 11 మంది నిందితులు పీఎస్ లో లొంగిపోయిన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో, గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ ను విధించారు.