: మీట నొక్కితే చాలు... తక్షణ సాయం


రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపధ్యంలో మగువలను రక్షించేందుకు సరికొత్త విధానాలను, పరికరాలను తయారుచేస్తున్నారు. ఇందులో భాగంగా రూపొందిందే 'నిర్భయ' పరికరం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఎలక్ట్రానిక్‌ పరికరం ఆపదలో చిక్కుకున్న ఆడవారికి ఆపద్భాంధవిలాగా ఉపకరిస్తుంది. ఈ పరికరాన్ని ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసింది.

చిన్నగా ఉండే నిర్భయ పరికరానికి ఉన్న చిన్న మీటను నొక్కితే చాలు మీరు అపాయంలో ఉన్నట్టు మీ ఆప్తులకు తెలిసిపోతుంది. తక్షణం మీకు సాయం లభిస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. శుక్రవారం నాడు దీన్ని ముంబైలో ఆవిష్కరించారు. ఈ పరికరం జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం)తో పనిచేస్తుంది. ఈ పరికరాన్ని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈసీఐఎల్‌ దీన్ని తయారుచేసింది. నిర్భయను సెల్‌ఫోనుతో అనుసంధానం చేసిన మరుక్షణం నుండి అది పనిచేయడం ప్రారంభిస్తుంది. మహిళలకు బాగా ఉపయోగపడే ఈ పరికరం ధరను ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీని ధరను నిర్ణయిస్తామని, అందరికీ అందుబాటులో ఉండేలాగా దీని ధర ఉంటుందని ఒక ఈసీఐఎల్‌ ఉన్నతాధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News