: ఈ జన్యువు చాలా మంచిది


మన శరీరంలోని పలు రకాలైన జన్యువుల్లో కొన్ని మేలు చేసేవిగాను, మరికొన్ని కీడు చేసేవిగాను ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక రకమైన జన్యువు క్యాన్సర్‌ కణితిని నివారించడంలో చక్కగా తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన శరీరంలోని కణాలు తమంత తాముగా నశించే ప్రక్రియకు (అపోప్టాసిస్‌) అవసరమైన ప్రోటీన్ల తరగతికి చెందిన ఒక జన్యువు బ్లడ్‌ క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ శరత్‌కుమార్‌ సుమారు ఇరవై ఏళ్లకు ముందు క్యాస్‌పేస్‌-2 అనే జన్యువును గుర్తించారు. ఈ జన్యువు బ్లడ్‌ క్యాన్సర్‌ను నిలువరించడంలో కీలక పాత్రను పోషిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయం గురించి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ కణాలు చనిపోవడంలోను, మనుగడ సాగించడంలోను చాలా జన్యువులు పాలుపంచుకుంటాయని, అయితే ఈ జన్యువుల్లో అసాధారణ మార్పులు జబ్బులకు కారణమవుతాయని, ఉదాహరణకు కణాలు తమంతగా తాము నశించిపోతే క్యాన్సర్‌కు దోహదం చేస్తాయని తెలిపారు. క్యాస్‌పేస్‌-2 జన్యువు కణితి ఏర్పడటాన్ని నివారిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ జన్యువు క్యాన్సర్‌ కణాలుగా మారే అవకాశంగల కణాల్లోని క్రోమోజోముల సంఖ్య సరిగా ఉండేలా నియంత్రించడం ద్వారా ఇది క్యాన్సర్‌ వ్యాధిని నిలువరిస్తున్నట్టు శరత్‌కుమార్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News