: వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి చురుగ్గా సన్నాహాలు


గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో ఏర్పాటు చేయనున్న సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ఆరు లక్షల యాభైవేల గ్రామాల నుంచి మట్టి, ఇనుము సేకరణకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందుకు గాను దక్షిణ భారత దేశంలో ఇనుము, మట్టి సేకరణపై నాలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన కమిటీలతో గుజరాత్ హోం, న్యాయ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు ఈ నెల 24న హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. ఈ వర్క్ షాప్ కు దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News