: సైబరాబాద్ లో వేలాది మంది పని చేస్తున్నారు: చంద్రబాబు
సైబరాబాద్ లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. సైబర్ టవర్స్ కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ రోజు హైటెక్ సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైటెక్ సిటీ వల్ల వేలాది మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ఐటీలో మనతో బెంగళూరు పోటీపడినా నిలదొక్కుకోలేక పోయిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చేసే క్రమంలో తాను అమెరికాలో 15 రోజుల పాటు తిరిగినట్టు చెప్పారు. 9 ఏళ్ల కాలంలో సైబరాబాద్ నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఒకప్పుడు కొండలతో ఉన్న మాదాపూర్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చంద్రబాబు తెలిపారు.