: ప్రధాని కావాలనే మత్తులో జోగుతున్న మోడీ: కపిల్ సిబల్
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మోడీపై కాంగ్రెస్ నేతల విమర్శలు అంతకంతకూ పదునెక్కుతున్నాయి. తాజాగా, భారత ప్రధాని కావాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ ఒక రకమైన మత్తులో జోగుతున్నారని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఎక్కడుంటే అక్కడ తనకు నచ్చని వారిపై నిఘా ఉంచడం లేదా ఫోన్ ట్యాపింగ్ లు చేయించడం లాంటి పనులు చేయిస్తుంటారని ఆరోపించారు.