: 'కేబీసీ' ఫైనల్ ఎపిసోడ్ కు బిగ్ బి డబల్ రోల్
సినిమాల్లో మాత్రమే కనిపించే ద్విపాత్రాభినయం త్వరలో టెలివిజన్ తెరపై, అదీ ఓ గేమ్ షోలో కనిపించనుంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా క్రోర్ పతి'-7 గేమ్ షో సోనీ చానల్ ల్లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ షో ముగింపు ఎపిసోడ్ ప్రసారమవనుంది. దానికి ప్రత్యేకంగా బిగ్ బీ డబల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయనున్నాడట. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. చివరి ఎపిసోడ్ ను మిస్సవద్దని కూడా చెప్పాడు.