: తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉంది: వెంకయ్యనాయుడు
తెలంగాణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని అన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని కూడా సీఎం కిరణ్ పట్టించుకోవడం లేదని తెలిపారు. బీజేపీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.