: ఉన్నత విద్యకే మా తొలి ప్రాధాన్యం: జయలలిత
మా తొలి ప్రాధాన్యత ఉన్నత విద్యకేనని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ 34వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అందర్నీ విద్యావంతులను చేయడమే తమ ముందున్న కర్తవ్యమని అన్నారు. ఉన్నత విద్యకు తాము పెద్ద పీట వేశామని, చదువుకునేందుకు అనువైన పథకాలను తమ ప్రభుత్వం ప్రకటించిందని ఆమె తెలిపారు.