: హైదరాబాద్ పై సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కానుంది. హైదరాబాద్ ను యూటీ చేయాలంటూ సీమాంధ్ర మంత్రులు గట్టిగా పట్టుపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కానుంది. భేటీలో సీమాంధ్ర మంత్రుల డిమాండ్ పై విస్తృతంగా చర్చించనున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీతో 45 నిమిషాల పాటు సమావేశమై ఆయన అభిప్రాయం తీసుకున్నారు. దీనిపై ఇతర నేతల అభిప్రాయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ సిద్ధమవుతోంది.