: మచిలీపట్నం వద్ద తీరం తాకిన హెలెన్ తుపాను
హెలెన్ తుపాను మచిలీపట్నం వద్ద తీరం తాకింది. తక్కువ వేగంతో కదులుతున్న హెలెన్ తుపాను ధాటికి తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటేందుకు మరో గంట సమయం పడుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీరం దాటిన మరో 12 గంటల వరకు దీని ప్రభావం తీరంపై తీవ్రంగా ఉంటుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి చాలా చోట్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. కురుస్తున్న వర్షాల ధాటికి, వంద కిలోమీటర్లపై బడిన వేగంతో వీస్తున్న గాలుల ధాటికి చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మార్వో సత్యనారాయణ మృతి చెందారు.