: రాష్ట్ర మాజీ ఐపీఎస్ అధికారులకు సుప్రీంలో చుక్కెదురు


రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులు దినేశ్ రెడ్డి, ఉమేశ్ కుమార్ లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వీరిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై... సుప్రీం సూచనల కంటే సీబీఐ ఎక్కువగా దర్యాప్తు చేస్తోందంటూ దినేశ్ రెడ్డి పిటిషన్ వేశారు. దాన్ని అడ్డుకోవాలంటూ అందులో కోరారు. అటు మేజిస్ట్రేట్ కోర్టులో తనపై విచారణ జరపాలంటూ ఉమేశ్ కుమార్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటినీ కోర్టు తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News