: బీటెక్ విద్యార్థికి జీవిత ఖైదు


స్నేహితుడిని హత్య చేసిన కేసులో బీటెక్ విద్యార్థికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. సహరాన్ పూర్ కు చెందిన జాగ్రత్, మొరాదాబాద్ కు చెందిన శాంతను బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. గతేడాది ఏప్రిల్ 19న కాలేజీ వార్షికోత్సవం రాత్రి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో జాగ్రత్ శాంతనుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన శాంతను ఆస్పత్రిలో కన్నుమూశాడు. దీంతో కోర్టు జాగ్రత్ ను దోషిగా ప్రకటిస్తూ జీవిత ఖైదు, రూ. 50వేల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News