: హెలెన్ తుపానుపై ముఖ్యమంత్రి సమీక్ష
తీవ్ర రూపం దాలుస్తున్న హెలెన్ తుపానుపై సీఎం కిరణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల సహాయ, పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన రక్షణ చర్యలను సమీక్షించారు.