: చైనా విడాకుల ప్రోత్సాహక చట్టం.. !
దంపతులు సాధారణంగా మనస్పర్థల కారణంతోనే విడాకులు కోరుతారు. అలాకాకుండా అన్యోన్యంగా ఉంటున్న వేలాది జంటలు మూకుమ్మడిగా విడాకులు కోరుతున్నాయంటే ఏమనుకోవాలి? చైనాలో రాత్రికి రాత్రే పెరిగిపోయిన విడాకుల కేసులను చూసి షాంఘై అధికారులకు మతిపోయింది.
ఆరా తీయగా తమ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'ట్యాక్స్ లా' నిర్వాకమే ఇదంతా అని తేలేసరికి హుటాహుటిన చట్టసవరణ పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. 'ట్యాక్స్ లా' ప్రకారం రెండు ఇళ్లు ఉన్న దంపతులు రెండో ఇల్లు అమ్మే సమయంలో 20 శాతం విక్రయపన్ను ప్రభుత్వానికి చెల్లించాలి.
విడాకులు తీసుకుంటే భార్యాభర్తలకు చెరో ఇల్లు ఉంటుంది కదా. అప్పుడు విక్రయపన్ను చెల్లించనవసరం లేదని రెండిళ్ల దంపతులంతా విడాకులు తీసుకోవడానికి ఈ విధంగా పోటీపడ్డారన్నమాట. చూశారుగా.. చట్టాన్ని ఏవిధంగా చుట్టంలా మలుచుకున్నారో..!