: తెలంగాణలో టీడీపీ, వైఎస్సార్ సీపీలు గల్లంతే: ఈటెల


సమైక్యవాదం, సమన్యాయం అంటున్న పార్టీల అడ్రస్సులు తెలంగాణలో గల్లంతవ్వడం ఖాయమని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సమైక్యత ముసుగులో తెలంగాణపై సీఎం మొసలికన్నీరు కార్చొద్దని సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News