: విభజనను రాజ్యాంగబద్ధంగా కాకుండా వివాదాస్పదంగా చేస్తున్నారు: చంద్రబాబు
రాష్ట్ర విభజనను కేంద్రం రాజ్యాంగ బద్ధంగా కాకుండా వివాదాస్పదం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. విభజన అనేది కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించినదని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఒక పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దిగ్విజయ్ సింగ్ ను రాష్ట్ర గవర్నర్ కలవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ అధిపతులకు స్పష్టమైన అధికారాలు ఉన్నాయని, రాజ్యాంగ సంస్థలన్నీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అలుపులేని పోరాటం చేస్తోంది ఒక్క టీడీపీయేనన్నారు. ఎన్టీఆర్ పోరాటం వల్లే గతంలో అనేక కమిషన్లు వేశారని గుర్తు చేశారు. సూట్ కేస్ కంపెనీలతో చర్చలకోసమే జగన్ కోల్ కతా వెళ్లారని ఎద్దేవా చేశారు.