: ముజఫర్ నగర్ కేసులో నిందితులైన ఎమ్మెల్యేలకు సన్మానం
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న భాజపా ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్, సురేష్ రాణాలను ఆ పార్టీ ఈ రోజు ఘనంగా సన్మానించింది. వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిని సన్మానించారు. ఈ కార్యక్రమం అనంతరం, ఈ సభకు మోడీ హాజరయ్యారు. భాజపాను అపకీర్తిపాలు చేసేందుకే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలు నిరాధారాలని న్యాయస్థానం పేర్కొందని... అందుకే వారిని సన్మానించామని భాజపా తెలిపింది.