: భయాందోళనల్లో మత్స్యకారులు


హెలెన్ తుపాను నేపథ్యంలో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విశాఖలోని ఫిషింగ్ హార్బర్ కు 600 బోట్లు చేరుకున్నాయి. ఫైలిన్, వాయుగుండం, హెలెన్, మరో తుపాను హెచ్చరిక నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు ముందుగా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

తుపాను తీవ్రతకు కాకినాడ, ఉప్పాడ మధ్యనున్న రహదారి పూర్తిగా ధ్వంసమైంది. మచిలీపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో హెలెన్ తుపాను కేంద్రీకృతమై ఉందని, రేపు సాయంత్రానికి ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News