: ఆశారాం బాపు కుమారుడి ముందస్తు బెయిల్ తిరస్కృతి
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి ముందస్తు బెయిల్ దరఖాస్తును సూరత్ లోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. సూరత్ కి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చేసిన ఫిర్యాదు మేరకు అక్టోబరు 6న తండ్రీ కొడుకులపై లైంగిక వేధింపుల కేసు దాఖలైంది. ప్రాథమిక విచారణలో సేకరించిన బలమైన ఆధారాల నేపథ్యంలో, బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం పేర్కొంది. గత వారం నుంచి నారాయణ్ సాయి ఆచూకీ తెలియడం లేదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.