: భద్రాచలం తెలంగాణదైతే.. శ్రీశైలం సీమాంధ్రదే: మంత్రి ఏరాసు


తెలంగాణవాదులు రికార్డుల పేరుతో చెబుతున్నట్టు భద్రాచలం తెలంగాణ ప్రాంతానిదైదే, అటవీ రికార్డుల్లో పేర్కొన్నట్టు శ్రీశైలం ప్రాజెక్టు సీమాంధ్రదేనని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, విభజనపై ఓపక్క చర్చలు జరుగుతున్నాయంటూనే, మరోపక్క పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని అంటున్నారని మండిపడ్డారు. విభజనపై మిగతా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అనుసరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీ బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగాలని, చర్చ సందర్భంగా సభ్యులందరికీ మాట్లాడేందుకు, అభిప్రాయాలు చెప్పేందుకు సమయమివ్వాలని ఆయన కోరారు. ఏది అనుకూలంగా ఉంటే అది మాట్లాడడం తెలంగాణ నేతలకు సరికాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News