: ముగిసిన జీవోఎం సమావేశం
నార్త్ బ్లాక్ లోని హోంమంత్రి కార్యాలయంలో జీవోఎం సమావేశం ముగిసింది. విభజన ముసాయిదాపై గంటన్నరపాటు జీవోఎం సమావేశం కొనసాగింది. రేపు మరోసారి జీవోఎం సభ్యులు భేటీ కానున్నారు. చిదంబరం, ఆజాద్ మినహా నేటి భేటీకి అందరూ హాజరయ్యారు. ఆ వెంటనే జీవోఎంతో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, జేడీ శీలం భేటీ అయ్యారు.