: ఇవన్నీ ముందే తెలిసి ఉంటే క్రికెట్ ఆడేవాడిని కాదేమో: కపిల్ దేవ్


క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ దివానా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న కపిల్ ను... 'సార్, మీరు దిల్ దివానాగా ఎప్పుడు మారారు?' అని యాంకర్ అడిగారు. దానికి సమాధానంగా, 'చిన్నప్పుడే క్రికెట్ తో దిల్ దివానాగా మారిపోయానని' కపిల్ అన్నారు. అప్పట్లో తనకు సినిమాలు, రంగుల ప్రపంచం.. ఏమీ తెలియవని, ఒక వేళ తెలిసి ఉంటే తాను క్రికెటర్ ని అయ్యేవాడిని కాదేమో అని అభిప్రాయపడ్డారు.

తానిప్పటి వరకు ఎలాంటి సినిమా ఫంక్షన్లకు హాజరు కాలేదని, ఈ ఆడియో విడుదల తనకు జీవితాంతం గుర్తుంటుందని అన్నారు. ఈ సినిమా చూసినా తనకు అర్థం కాదని, సినిమాలో ప్రతి విషయాన్ని ఎవరూ అనువాదం చేయలేరని, అందుకే సినిమా హిందీలో డబ్బింగ్ చేస్తే తనకు చెప్పాలని దర్శకుడిని కోరారు. హిందీలో వస్తే తాను తప్పకుండా చూస్తానన్న హర్యానా హరికేన్, పాటలు పాడటం వచ్చేవరకు కారులో పెట్టుకుని వింటానని మాటిచ్చారు.

  • Loading...

More Telugu News