: నేపాల్ మాజీ ప్రధాని ప్రచండకు ఓటమి


మావోయిస్టుల మాజీ నేత, నేపాల్ మాజీ ప్రధాని ప్రచండ ఓటమి పాలయ్యారు. ఆ దేశ అసెంబ్లీకి తాజా జరిగిన ఎన్నికల్లో ఖాట్మండ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం ఎదుర్కొన్నారు. దశాబ్ద కాలం పాటు నేపాల్ ప్రభుత్వంపై తుపాకీతో పోరాడిన తర్వాత ప్రచండ ఆధ్వర్యంలోని మావోయిస్టులు ప్రజాస్వామ్య మార్గంలో నడిచారు. ఈ క్రమంలోనే ప్రచండ.. (ఆయన అసలు పేరు పుష్పకమల్ దహాల్) 2008 నుంచి రెండేళ్లపాటు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. కానీ తమ సమస్యలను విస్మరించినందుకు ప్రజలు ఓటుహక్కు ద్వారా ప్రచండను శిక్షించారు.

  • Loading...

More Telugu News