: స్కూల్ క్రికెట్ లో 546 పరుగులు చేసిన చిచ్చరపిడుగు


15 ఏళ్ల ముంబై కుర్రాడు పృథ్వి షా స్కూల్ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 546 పరుగులు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. ఇందులో 85 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. ముంబైలో జరుగుతున్న హ్యారిస్ షీల్డ్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో సెయింట్ ఫ్రాన్సిస్, రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూళ్ల మధ్య జరిగిన మ్యాచ్ లో... స్ప్రింగ్ ఫీల్డ్ ఆటగాడు పృథ్వి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పృథ్వి ధాటికి 1933-34 సీజన్ లో దాదాభోయ్ హవేవాలా పేరు మీదున్న 515 పరుగుల రికార్డు కనుమరుగయింది.

  • Loading...

More Telugu News