: రేపటి వన్డేకు విండీస్, టీమిండియా రె'ఢీ'
ఓ సమరం ముగిసింది.. మలి సమరానికి రంగం సిద్ధమైంది. వెస్టిండీస్, భారత జట్ల మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కోచిలో జరుగనున్న తొలి వన్డేకు టీమిండియా రెడీ అయింది. టెస్టు సిరీస్ లో ఘోరపరాజయాన్ని చవిచూసిన విండీస్ వన్డేలలో సత్తా చూపి పరువు దక్కించుకోవాలనుకుంటోంది. మరో వైపు టీమిండియా మాత్రం వన్డేలను కూడా గెలిచి తన జోరు కొనసాగించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ ఆసక్తిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు జట్లు కోచికి చేరుకుని ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. ఆసీస్ తో ఆడిన జట్టునే టీమిండియా కొనసాగించనుండగా విండీస్ రెండు మార్పులతో బరిలో దిగనుంది.