: బాలల చలనచిత్రోత్సవ ముగింపు వేడుకలకు పవన్ కల్యాణ్
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఇండియాలు సంయుక్తంగా నిర్వహించిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఈ సాయంత్రం 5.30 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్, గౌరవ అతిథిగా మంత్రి డీకే అరుణలు హాజరుకానున్నారు. ఈ ముగింపు వేడుకల్లో ఎన్నడూ జరగని సన్నివేశం చోటుచేసుకోనుంది. మామూలుగా ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా వుండే సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ముగింపు వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నాడు. సాధారణంగా తన సొంత సినిమా ఫంక్షన్లలో తప్ప మరెక్కడా కనిపించని పవన్ ఈ వేడుకల్లో పాలుపంచుకోనుండటం సినీవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.