: ప్రయాణీకులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ సమీపంలోని గణేష్ దేవాలయం వద్ద ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది పాదచారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.