: సచిన్ పెవిలియన్ ను ప్రారంభించిన ధోనీ
కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మాజీ క్రికెటర్ సచిన్ పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్ ను టీమిండియా కెప్టెన్ ధోనీ ఈ రోజు ప్రారంభించారు. భారత్, విండీస్ జట్ల మధ్య తొలి వన్డే రేపు ఈ స్టేడియంలోనే జరగనుంది. సచిన్ పెవిలియన్ లో సచిన్ క్రికెట్ కెరీర్ ఆరంభించినప్పటి నుంచి చివరి వరకూ పలు ఫొటోలు, ఆయన భార్య అంజలి, పిల్లలు అర్జున్, సారా, ఇతర క్రికెటర్ల ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా మాజీ క్రికెటర్ సేవలను ఘనంగా కొనియాడారు.