: కోల్ కతా చేరుకున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కోల్ కతా చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు, ఆయన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కోల్ కతా చేరుకున్నారు.