: నకిలీ చెక్కుల ఘరానా మోసగాళ్లు అరెస్టు.. 80 తులాల బంగారం స్వాధీనం


జువెలరీ షాపుల్లో నకిలీ చెక్కులతో మోసాలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను హైదరాబాదు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరికృష్ణ, శ్రీనివాస్ లు హైదరాబాదులోని జువెలరీ షాపుల్లో బంగారం కొనుగోలు చేసి కొంత మొత్తం చెల్లించి నకిలీ చెక్కులిచ్చి కుచ్చుటోపీ పెడుతున్నారు. దీనిపై గత కొంత కాలంగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో నిఘా వేసిన పోలీసులు ఈ ఉదయం నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 80 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News