: 'చనిపోయిన' వందకోట్ల మోసగాడు చిక్కాడు!
రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారంలో వందల మందిని నిలువునా ముంచి వందకోట్లకు కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి, రియల్టర్ అవతారమెత్తిన నార్ల వంశీకృష్ణ స్థానికులు, పోలీసులు, పారిశ్రామిక వేత్తల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి రెండేళ్ల క్రితం తల్లితో సహా కారును కాల్వలోకి తోసి వేసి తాను కూడా చనిపోయినట్టు హైడ్రామా సృష్టించి అదృశ్యమయ్యాడు.
దీంతో అతనిపై విజయవాడలోని సత్యానారాయణపురం, మాచవరం, వన్ టౌన్, పటమట పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. గత రెండేళ్లుగా పలు రాష్ట్రాలకు, సింగపూర్ కు మకాం మార్చిన వంశీకృష్ణ తాజాగా స్థానికంగా పనులు చక్కబెట్టుకునేందుకు వచ్చాడు. అతనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. దీంతో సూర్యారావుపేట పోలీసులు అతనిని విచారిస్తున్నారు.