: 35 బస్సులను సీజ్ చేసిన రవాణాశాఖ అధికారులు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పటాన్ చెరు టోల్ గేటు వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టి రెండు వోల్వో బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్, గగన్ పహాడ్ వద్ద తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 13 బస్సులను సీజ్ చేశారు. విజయవాడలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 20 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు.