: రోజూ చూసుకుంటే తగ్గుతామట
బరువు తగ్గాలని బోలెడు ప్రయత్నాలు చేస్తుంటాం. ఇలా ప్రయత్నం ప్రారంభించిన తొలిరోజుల్లో బరువు చూసుకుంటాం. తర్వాత బరువు తగ్గడం లేదని కొద్దిరోజులకు తగ్గేందుకు చేసే ప్రయత్నాలను పక్కన పెట్టేస్తాం. అలాకాకుండా నిత్యం మనం బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం? ఎలాంటి వ్యాయామాలు చేస్తున్నాం? వంటివి పరిశీలించుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
బరువు తగ్గేందుకు మన ఆహారంలో చేసుకున్న మార్పులు, శారీరక వ్యాయామం వంటి చర్యలను గురించి టెక్ట్స్ మెసేజ్లతో పరిశీలించుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం మీరు తినే ఆహారం, వ్యాయామ అలవాట్లను గురించి విపులంగా ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా టెక్ట్స్ మెసేజ్ చేయడంగానీ, లేదా కాగితంపైన రాసుకోవడం ద్వారాగానీ ఇలా నిరంతరం బరువును పరిశీలించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలాంటి సమాచారాన్ని టెక్ట్స్ మెసేజ్ల రూపంలో పర్యవేక్షించడం వల్ల సమయం ఆదా కావడమే కాకుండా ఆరోగ్య అలవాట్లకు కట్టుబడి ఉంటారని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి రోజూ మీరు నడిచిన అడుగులు, తాగిన డ్రింక్స్ వంటి వాటికి సంబంధించిన వివరాలను ఇలా మెసేజ్లు చేసిన వారిని పరిశీలించినప్పుడు మంచి ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.