: బాల నేరస్థులంటే ఎవరు?: సుప్రీం తర్జనభర్జన


బాల నేరస్థుల వయోపరిమితి అంశం సుప్రీం కోర్టులో చర్చనీయాంశమైంది. బాల నేరస్థుల వయసు ఎంత ఉండాలి? అనే విషయంలో రాజ్యాంగ నిర్వచనంపై పరిశీలన జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఇప్పటి వరకు 18 ఏళ్లలోపు వారు నేరాలకు పాల్పడితే బాల నేరస్థులుగా పరిగణిస్తున్నారు. అయితే ఢిల్లీ అత్యాచారం కేసులో ఓ నిందితుడి వయసు 18 ఏళ్ల కంటే తక్కువే. అయినా అతనికి మిగిలిన ఐదుగురితో సమానంగా శిక్షపడాలని సర్వత్ర డిమాండ్ వినిపిస్తోంది. 

అంతేకాదు, రాజ్యాంగంలోని బాల నేరస్థుల చట్టంలోని సెక్షన్లు 2(కె), 10,17 రాజ్యాంగపరంగా అహేతుకమని ఆరోపిస్తూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఏడేళ్ల లోపు పిల్లలు చేసేవి నేరాలు కాదు, ఏడేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు పరిపక్వత, చట్టాలపై అవగాహన ఉండవని పిటిషనర్లు తెలిపారు.

ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం..కేసు విచారణలోను, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సహకరించాలని అటార్నీ జనరల్ ను కోరింది. 

  • Loading...

More Telugu News