: సీమాంధ్ర నేతల భవిష్యత్ త్వరలో భూస్థాపితం: అశోక్ బాబు
సీమాంధ్ర నేతల భవిష్యత్ త్వరలో భూస్థాపితం అవుతుందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో చర్చ జరగకుండానే తెలంగాణ బిల్లు రావడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులు ప్యాకేజీ కోరడం దురదృష్టమన్నారు. ఈ నెల 24న ఏపీఎన్జీవోల సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలందరినీ కలుస్తామని అశోక్ బాబు చెప్పారు.