: శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే 93 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 25 నుంచి ఈ రైళ్లను నడుపుతారు. 20 నుంచి వీటికి అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. చాలావరకు ఈ ప్రత్యేక రైళ్లు చెన్నై సెంట్రల్ నుంచి బయల్దేరనున్నాయి.