: ఛత్తీస్ గఢ్ లో ముగిసిన పోలింగ్.. ఒకరి మృతి
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ మలివిడత పోలింగ్ ముగిసింది. నలభై లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, అమిత్ జోగి నియోజకవర్గం మర్వాహిలో నలభై శాతం ఓట్లు పోలవ్వగా, అత్యల్పంగా మహాసముందర్ నియోజకవర్గంలో పోలయ్యాయి. పోలింగ్ సందర్భంగా భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రం కాస్త మెరుగ్గానే ముగిసింది. సాజా నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్ వద్ద భద్రతా సిబ్బందికి, ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఓటర్లను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. వీటిలో ఒకరు మృతి చెందారు. కాగా పోలింగ్ బూత్ కు మద్యంతాగిన వ్యక్తులు తరచూ వచ్చి గొడవ పడ్డారని, వారిని చెదరగొట్టేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని డీజీపీ తెలిపారు.